కృష్ణా: ఘంటసాల మండలం శ్రీకాకుళం గ్రామంలో శ్రీకాకుళేశ్వరస్వామి దేవస్థానంలో పవిత్రోత్సవాల సందర్భంగా శనివారం శాంతి కళ్యాణం వైభవంగా జరిగింది. ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ – విజయలక్ష్మి దంపతులు ముఖ్య అతిధులుగా విచ్చేసి స్వామివార్లను దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేశారు. దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు ఆధ్వర్యంలో సత్కరించారు.