SRD: స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈనెల తొమ్మిదవ తేదీన పటాన్చెరులోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో అండర్- 17 బాలుర క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఎస్జీఎఫ్ కార్యదర్శి శ్రీనివాసరావు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. క్రికెట్ పోటీలో పాల్గొనే విద్యార్థులు ఉదయం 9 గంటలకు చేరుకోవాలని చెప్పారు. ఆధార్ కార్డు, బోనాఫైడ్ తీసుకురావాలని పేర్కొన్నారు.