SRPT: ప్రజా సమస్యలపై దృష్టి పెట్టి వాటి పరిష్కారం కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు కొలిశెట్టి యాదగిరిరావు కోరారు. శనివారం తుంగతుర్తి మండలం వెలుగుపల్లిలో సీపీఎం ఆధ్వర్యంలో ఇంటింటా సర్వే కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. గ్రామాల్లో గ్రామ పంచాయతీ పాలకులు లేకపోవడం చేత ఎక్కడి సమస్య అక్కడనే ఉన్నాయన్నారు.