ELR: చాట్రాయి గ్రామంలోని గ్రోమోర్ ఫెర్టిలైజర్ షాపు వద్ద తహసీల్దార్ బద్రు, వ్యవసాయ అధికారి శివశంకర్, SI రామకృష్ణ బృందం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు రైతులతో మాట్లాడుతూ.. మండలంలో సాగు చేస్తున్న వరి విస్తీర్ణానికి సరిపడా యూరియాను ఇప్పటికే అందించడం జరిగిందని తెలిపారు. యూరియా అమ్మకాలపై అధికారులు కఠిన నిఘా ఉంచుతున్నారు.