MDK: మెదక్ కలెక్టరేట్ కార్యాలయంలో ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని శనివారం ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. జిల్లా నుంచి 58 మందిని ఎంపిక చేయగా ఎమ్మెల్సీలు అంజిరెడ్డి, మల్క కొమురయ్య, కలెక్టర్ రాహుల్ రాజ్ ముఖ్య అతిథులుగా హాజరై ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి రాధాకిషన్ పాల్గొన్నారు.