కృష్ణా: యువత అవకాశాలు అందుకోవాలని పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా కోరారు. శనివారం పామర్రు మండలం కురుమద్దాలిలో జిల్లా స్థాయి మెగా జాబ్ మేళా జరిగింది. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వచ్చిన అవకాశం అందుకుని, లక్ష్యం వైపు పయనించాలని కోరారు. కార్యక్రమంలో జనసేన పార్టీ ఇంఛార్జ్ తాడిశెట్టి నరేష్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.