MDK: తూప్రాన్ పట్టణంలో జీఎస్టీ తగ్గింపుపై శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి బీజేపీ నాయకులు క్షీరాభిషేకం నిర్వహించారు. తహసీల్ధార్ కార్యాలయం ఎదుట ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటం ఏర్పాటు చేసి క్షీరాభిషేకం నిర్వహించారు. పేదలకు భారం తగ్గించాలని జీఎస్టీని తగ్గించినట్లు పట్టణ అధ్యక్షులు జానకిరామ్ గౌడ్ తెలిపారు.