ఖమ్మం కలెక్టరేట్లోని ఈవిఎం గోడౌన్‌ను మంగళవారం కలెక్టర్ దివాకర అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డితో కలిసి తనిఖీ చేశారు. గోడౌన్ సీల్‌ను పరిశీలించి భద్రతా సిబ్బంది ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. షిఫ్టుల వారీగా డ్యూటీలు సమయపాలనతో నిర్వహించాలని ఆదేశించారు. అనంతరం తనిఖీ రిజిస్టర్లో సంతకం చేశారు. ఈ తనిఖీల్లో ఎన్నికల విభాగం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.