SRCL: గంభీరవుపేట మండలంలో ఉపముఖ్యమంత్రి, మంత్రుల బృందం పర్యటన నేపథ్యంలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు. పర్యటన దృష్ట్యా గంభీరవుపేట మండలంలో ఏర్పాట్లను,హెలిప్యాడ్‌ను ఎస్పీ స్వయంగా అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించి, అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేయాలని తెలిపారు.