ADB: దొంగ వస్తువులు కొనుగోలు చేసిన ముజాహిద్ అనే స్క్రాప్ దుకాణ యజమానిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు బోథ్ CI గురుస్వామి నిన్న తెలిపారు. దిగ్నూర్ గ్రామానికి చెందిన కొరెల్లి రామకృష్ణ అనే వ్యక్తి బోర్వెల్ పైపులను దొంగలించి ముజాహిద్‌కు అమ్మినట్లు వెల్లడించారు. పంచాయతీ కార్యదర్శి స్వామి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.