WGL: ఖానాపురం మండలం బుధరావుపేట గ్రామంలో ప్రజా పాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి 98 మంది మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో 47 ఇందిరమ్మ ఇండ్లు, 244 కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసినట్లు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.