SDPT: జిల్లా అథ్లెటిక్స్ సంఘం ఆధ్వర్యంలో ఈనెల 31న స్థానిక స్టేడియం మైదానంలో జిల్లా స్థాయి అథ్లెటిక్స్ ఎంపికలు నిర్వహించనున్నట్లు ప్రధాన కార్యదర్శి కర్రోళ్ల వెంకటస్వామి గౌడ్ తెలిపారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యే ఈ పోటీల్లో అండర్-8 నుంచి అండర్-20 వరకు బాలబాలికలతో పాటు ఓపెన్ విభాగంలో స్త్రీ, పురుషులు పాల్గొనవచ్చన్నారు.