MHBD: వరంగల్లో రేపు (బుధవారం) నిర్వహించనున్న బీఆర్ఎస్ రైతు సంగ్రామ సభను విజయవంతం చేయాలని జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ నవీన్ రావు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల సమస్యలపై గళమెత్తేందుకు ఈ సభను ఏర్పాటు చేశామని, మండలంలోని రైతులు, కార్యకర్తలు భారీగా తరలిరావాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందని విమర్శించారు.