WGL: అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి వెళ్తున్న నేపథ్యంలో నల్లబెల్లి మండల బీజేపీ నాయకులను ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించడం సరి కాదని మండల అధ్యక్షుడు తడక వినయ్ అన్నారు. హామీలను ప్రశ్నించే సమయంలో అరెస్టులు సరికాదన్నారు. సీఎం స్పందించి ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాజు, కుమారస్వామి అనిల్ తదితరులు పాల్గొన్నారు.