NRPT: రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా మరికల్ మండల కేంద్రంలో సీఐ భగవంత్ రెడ్డి, ఎస్సై మహేశ్వరి విద్యార్థులతో మానవహారం ఏర్పాటు చేసి బుధవారం ప్రతిజ్ఞ చేయించారు. రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని, హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయకూడదని, మద్యం తాగి వాహనం నడప రాదని అన్నారు. రోడ్డు భద్రతా నియమాలు ఖచ్చితంగా పాటించి, ప్రమాదాలను నివారించాలని కోరారు.