KMM: వేసవిలో ప్రజలకు తాగునీటి ఎద్దడి కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఖమ్మం కలెక్టర్ దివాకర ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో జరిగిన సమీక్షలో మాట్లాడుతూ క్షేత్రస్థాయి అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ఫిర్యాదులపై తక్షణం స్పందించాలన్నారు. మిషన్ భగీరథ నీటి సరఫరాకు ప్రాధాన్యతనివ్వాలని,అవసరమైన చోట ట్యాంకర్ల ద్వారా నీరు అందించాలని సూచించారు.