NGKL: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో బీసీ గురుకుల బాలికల పాఠశాలలో ‘రోడ్డు సురక్ష అభియాన్’ నిర్వహించారు. ముఖ్య అతిథిగా డీఎల్ఎస్ఏ కార్యదర్శి ఏ. శ్రీదేవి పాల్గొని, విద్యార్థులు ట్రాఫిక్ నిబంధనలు, సిగ్నల్స్, జీబ్రా క్రాసింగ్‌లపై అవగాహన కలిగి ఉండాలి అన్నారు. రహదారి నియమాలు పాటించి ప్రమాదాలను నివారించాలని సూచించారు.