KNR: దేశంలో సామాజిక న్యాయం కోసం బాబు జగ్జీవన్ రామ్ విశిష్ట సేవలు అందించారని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వొడితల ప్రణవ్ కొనియాడారు. ఇవాళ హుజురాబాద్ పట్టణంలోని సైదాపూర్ క్రాస్ రోడ్డు వద్ద ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. తొలి ఉప ప్రధానిగా రక్షణ, వ్యవసాయ రంగాల్లో ఆయన చూపిన మార్గం ఆదర్శనీయమని, అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషి మరువలేనిదన్నారు.