జగిత్యాలలో బీఆర్ఎస్ ధర్నాతో కొనుగోళ్లపై చలనం వచ్చిందని మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి అన్నారు. మీడియాతో మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోళ్ల తీరుపై మండిపడ్డారు. జిల్లాలో కేవలం 20 మెట్రిక్ టన్నులే కొనుగోలు చేశారని విమర్శించారు. రైతులు రోడ్డెక్కటానికి ప్రభుత్వమే కారణమన్నారు. మొక్కజొన్న కొనడం లేదని ఆరోపించారు. రైతు బంధు, రుణమాఫీ అమలులో విఫలమైందన్నారు.