MDK: చేగుంట మండలం చందాయిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం గురుపూజోత్సవం ఘనంగా నిర్వహించారు. స్థానిక తాజా మాజీ సర్పంచ్ బుడ్డా స్వర్ణలత భాగ్యరాజ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఉపాధ్యాయ వృత్తి ఎంతో గౌరవప్రదం అయిందని, యువతకు దిశానిర్దేశం చేసేది గురువులేనని వారు అన్నారు.