జనగాం: జనగామ పట్టణ కేంద్రంలోని అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (UPHC)లో హ్యూమన్ పాపిలోమా వైరస్ (HPV) టీకా కార్యక్రమాన్ని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా నేడు ప్రారంభించారు. వారు మాట్లాడుతూ.. HPV టీకా బాలికలను సర్వికల్ క్యాన్సర్ నుండి రక్షించడంలో ఎంతో ముఖ్యమైనదని తెలిపారు. తల్లిదండ్రులు ఈ టీకా కార్యక్రమానికి సహకరించి బాలికలు తప్పనిసరిగా తీసుకునేలా చూడాలన్నారు.