AP: రాజధాని అమరావతిలో HOD టవర్ల విషయంలో కీలక ఘట్టం నమోదు అయింది. టవర్-1కు మొదటి స్టీల్ డయాగ్రిడ్ను అమర్చే పనులను మంత్రి నారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డయాగ్రిడ్ విధానంలో ప్రభుత్వం ఐదు ఐకానిక్ భవనాలు నిర్మిస్తోందన్నారు. అమరావతిలో జీఏడీ, HODలకు మొత్తం 5 టవర్లు డయాగ్రిడ్ టెక్నాలజీతో నిర్మిస్తున్నామని తెలిపారు.