MNCL: ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో నిబంధనల ప్రకారం రైతుల వద్ద నుండి వరి ధాన్యం కొనుగోలు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం భీమారం మండలం పొలంపల్లి గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. రైతులు ధాన్యాన్ని నిబంధనల ప్రకారం కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు.