NZB: జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షలు శనివారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు తెలుగు పరీక్షకు మొత్తం 24,404 మంది విద్యార్థులకు గాను 24,353 మంది హాజరైనట్లు డీఈవో అశోక్ తెలిపారు. వివిధ కారణాలతో 51 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరయ్యారు. కాగా, జిల్లా వ్యాప్తంగా 144 కేంద్రాల్లో ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు ముమ్మర తనిఖీలు చేపట్టాయి.