ASF: జిల్లాలోని 1,084 ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన మూత్రశాలల నిర్మాణాలను ఈనెల 31లోగా పూర్తి చేయాలని కలెక్టర్ హరిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తి చేసి విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని స్పష్టం చేశారు.