SRD: కంగ్టి గ్రామ ఆరాధ్య దేవుడైన శ్రీ సిద్దేశ్వర స్వామి జాతర ఉత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే స్థానిక నేతాజీ కూడలిలో 108 కట్టెలతో 30 అడుగుల ఎత్తు, రథాన్ని తయారుచేసి సిద్ధంగా ఉంచారు. గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆలయంలో జాతరకు ఏర్పాట్లు చేశారు. ఇవాళ సాయంత్రం శిఖరాన్ని ఊరేగించి రథంపై ప్రతిష్టిస్తారు.