మంచిర్యాల: జన్నారం మండలంలోని తిమ్మాపూర్ రామాలయం సమీపంలో పేకాట ఆడుతున్న వ్యక్తులలో ఒకరు గోదావరి నదిలో గల్లంతయ్యారని స్థానికులు తెలిపారు. శుక్రవారం రాత్రి కొందరు వ్యక్తులు రామాలయం సమీపంలో పేకాడుతుండగా గుర్తు తెలియని వ్యక్తులు లైట్లు వేశారు. దీంతో పోలీసులు వచ్చారని అనుమానంతో పేకాడుతున్న వారు పరుగులు తీయగా వారిలో ఒక వ్యక్తి గోదావరిలో గల్లంతయినట్టు వారు తెలిపారు.