SRPT: తెలంగాణను దోచుకున్న కేసీఆర్ను ప్రజలు ఎప్పుడో రాజకీయంగా భూస్థాపితం చేశారని ఎమ్మెల్సీ దయాకర్ విమర్శించారు. నిన్న రాత్రి మద్దిరాల మండల కేంద్రంలో ఒక ప్రత్యేక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ పగటి కలలు మానాలని, ఆయన బీజేపీతో జతకట్టడం ఖాయమని ఆరోపించారు. తన రాజకీయ స్వార్థం కోసమే కేసీఆర్ బయటకు వస్తున్నారని విమర్శించారు.