MNCL: దేశంలో జనాభాకు అనుగుణంగా బీసీలకు రిజర్వేషన్ కల్పించేందుకు రాజ్యాంగ సవరణ చేయాలని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. గురువారం మంచిర్యాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగ సవరణ ద్వారా అగ్రవర్ణ కులాలకు రిజర్వేషన్ కల్పించిన కేంద్ర ప్రభుత్వం బీసీలకు కూడా రిజర్వేషన్లు కల్పించాలన్నారు.