VKB: తాండూరు మండలం సిరిగిరిపేట్ గ్రామంలో విషాదం జరిగింది. వీరప్ప, లక్ష్మీ దంపతులకు ఓ కొడుకు, కూతురు ఉన్నారు. వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. 10నెలల క్రితం హనుమంత్ రెడ్డి వద్ద రూ. 1లక్ష అప్పు తీసుకున్నారు. పంటలు పండకపోవడంతో అప్పు తీర్చలేకపోయారు. అప్పులు తీర్చమని అవమానపరచడంతో లక్ష్మీ ఆత్మహత్యాయత్నానికి పాల్పడి మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేశారు.