ASF: ఆసిఫాబాద్ మండలం గూడెం గ్రామంలో బుద్ధ విహార్ భూమిని కొందరు కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని BSP జోనల్ కో-ఆర్డినేటర్ రామచంద్రం ఆరోపించారు. 2015లో గ్రామ సర్పంచ్, అధికారులు బుద్ధ విహార్ కోసం కొంత భూమిని కేటాయించారని, ఇప్పుడు కొందరు ఆ భూమిని కబ్జా చేసి, ప్రజలను భయపెడుతున్నారన్నారు. తక్షణమే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు ఫిర్యాదు చేశారు.