KNR: రోడ్డు నిర్మాణమే తప్ప, వంతెన ఊసే లేకపోవడంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. చిగురుమామిడి మండలంలోని పందిళ్ల నుంచి పర్వతగిరి వెళ్లే మార్గంలో అధికారులు రోడ్డు వేసి, మధ్యలో బ్రిడ్జిని గాలికి వదిలేశారు. దీంతో సాగునీటి కాలువ దాటడం ప్రమాదకరంగా మారింది. నిధులు మంజూరు చేసి, యుద్ధప్రతిపాదికన వంతెన నిర్మించాలని బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు డిమాండ్ చేశారు.