NLG: దోరెపల్లి-బోయినపల్లి మట్టి రోడ్డు పనులు ప్రారంభం అయ్యాయి. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రెండు కిలోమీటర్ల మేర రూ.15 లక్షల వ్యయంతో రోడ్డు పనులు చేపట్టారు. ఈ రెండు గ్రామాల మధ్య గతంలో ఉన్న రోడ్డు అధ్వానంగా మారింది. వర్షాలు పడినప్పుడు గుంతల మయంగా ఉన్న ఈ రోడ్డుపై వెళ్లలేని పరిస్థితి ఏర్పడేది. అయితే, ఉపాధి హామీ నిధుల కింద ఈ రోడ్డు వేస్తున్నారు.