SRCL: రైతులకు ఏకకాలంలో రూ. 2 లక్షల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. అసెంబ్లీలో మంగళవారం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతులకు రూ. 20,616 కోట్లను ఏకకాలంలో మాఫీ చేశామని అన్నారు. దీంతో సుమారు 25 లక్షల మంది రైతులు కొత్తగా రుణం పొందే అవకాశం కల్పించామన్నారు.