NLG: చందంపేట మండలం ముడుదండ్ల గ్రామానికి చెందిన పందిరి జనార్ధన్ రెడ్డి మృతి బాధాకరమని నల్గొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. గురువారం ముడుదండ్ల గ్రామంలో జనార్ధన్ రెడ్డి మృత దేహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన వెంట బీఆర్ఎస్ మండల నాయకులు తదితరులు ఉన్నారు.