SRPT: ఇటీవల ఎమ్మెల్యే మందుల సామెల్ నివాసంపై జరిగిన దాడిని నిరసిస్తూ, మిర్యాల గ్రామానికి చెందిన ఎన్నారై కాస రాకేష్ యాదవ్, పలువురు దళిత నాయకులు ఆదివారం ఆయనను కలిసి పరామర్శించారు. ప్రజాప్రతినిధులపై దాడులు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, ఇలాంటి చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని వారు పేర్కొన్నారు. ఎమ్మెల్యేకు తమ పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.