KMM: చింతకాని మండలం తిమ్మినేనిపాలెం గ్రామ మాజీ ఎంపీటీసీ, బీఆర్ఎస్ నాయకుడు ప్రభుదాస్(55) అనారోగ్యంతో మంగళవారం చనిపోయారు. పార్టీ సంస్థాగత నిర్మాణంలో, గ్రామ అభివృద్ధిలో ఆయన క్రియాశీల పాత్ర పోషించారు. ఆయన మృతి పట్ల పలువురు నాయకులు సంతాపం వ్యక్తం చేశారు మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.