NGKL: ఎర్రవల్లి గోకారం రిజర్వాయర్ కారణంగా తమ గ్రామాలు ముంపుకు గురికాకుండా చూడాలని, అలాగే R&R ప్యాకేజీ నోటిఫికేషన్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ చారకొండ మండలం ఎర్రవల్లి, ఎర్రవల్లి తండా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై వారు కొనసాగిస్తున్న రిలే నిరాహార దీక్షలు నేటితో 106వ రోజుకు చేరాయి. న్యాయం జరిగే వరకు ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తామని బాధితులు తెలిపారు.