NRML: జిల్లాలో ఎట్టి పరిస్థితుల్లోనూ త్రాగునీటి కొరత తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సమస్యలు ఎదురయ్యే ప్రాంతాలను ముందుగానే గుర్తించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు.