KMM: మధిర మండలంలో ప్రజాపాలనలో భాగంగా రైతు వారోత్సవాల్లో ఉద్యాన పంటలు, ఆయిల్ పామ్ సాగుపై కార్యక్రమం నిర్వహించారు. AMC ఛైర్మన్ బండారు నరసింహారావు ముఖ్య అతిథిగా పాల్గొని రైతులకు సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు. పంట అవశేషాలు కాల్చవద్దని సూచించారు. వ్యవసాయ అధికారులు మార్కెట్ డిమాండ్ ఉన్న పంటలు, బిందు సేద్యం ప్రాముఖ్యత వివరించారు.