ASF: ఉమ్మడి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంత ఉపాధి కూలీలకు డిజిటల్ హాజరు విధానం శాపంగా మారింది. ఉదయాన్నే పనులకు వెళ్లే కూలీలు తమ హాజరును ఆన్లైన్లో నమోదు చేసేందుకు కొండలు, గుట్టలు ఎక్కాల్సి వస్తోంది. ఫొటో క్యాప్చర్ కాకపోవడంతో గంటల తరబడి వేచి చూస్తున్నారు. తీవ్రమైన ఎండ కారణంగా ఫొటోలు సరిగ్గా క్యాప్చర్ కావడం లేదు.