BDK: భద్రాచలంలో రెండు రోజులు పాటు జరిగిన శ్రీరామనవమి, మహా పట్టాభిషేకం వేడుకలు విజయవంతంగా నిర్వహించిన జిల్లా యంత్రాంగాన్ని శనివారం రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు అభినందించారు. స్వామివారి వేడుకలు అత్యంత వైభోగంగా నిర్వహించుటలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో వారికి అప్పగించిన విధులను సమర్థవంతంగా నిర్వహించారన్నారు.