SRCL: ఈనెల 7న సంభవించనున్న చంద్రగ్రహణం కారణంగా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని మూసివేయనున్నారు. ఆలయ అర్చకులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం ఉదయం 11:25 గంటల నుంచి సోమవారం తెల్లవారుజామున 3:45 వరకు ఆలయాన్ని మూసి ఉంచుతారు. ఈ రెండు రోజులు భక్తుల ఆర్జిత సేవలు రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు. సంప్రోక్షణ అనంతరం భక్తుల దర్శనం ఉంటుందన్నారు.