WGL: దుగ్గొండి మండలంలోని అడవిరంగాపురం శివారులో గోపగానితండాలో శనివారం రాత్రి అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. విద్యుత్తు షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఎకరంన్నర మొక్కజొన్న పంట పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో సుమారు రూ. లక్ష నష్టం వాటిల్లిందని బాధిత రైతు అజ్మీర రవికుమార్ తెలిపారు. తనకు ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందించాలని ఆయన అధికారులను కోరారు.