MNCL: కన్నెపల్లి మండల కేంద్రంలో 20 కిలోల పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై భాస్కర్ తెలిపారు. నమ్మదగిన సమాచారం మేరకు వ్యవసాయ అధికారి యమున పోలీస్ సిబ్బందితో కలిసి వెంకటాపూర్ గ్రామంలో తిరుపతి ఇంట్లో తనిఖీలు నిర్వహించగా 20 కిలోల నకిలి విత్తనాలు లభించాయన్నారు. నిందితుడిపై కేసు నమోదు చేశామని వివరించారు.