NRPT: మక్తల్ మున్సిపాలిటీ పరిధిలోని యాదవ్ నగర్లో ఉన్న శ్రీ వీరభద్ర స్వామి జాతర సందర్భంగా శుక్రవారం ఆలయ కమిటీ సభ్యులు, స్థానికులు జాతర పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆదివారం నుంచి మంగళవారం వరకు స్వామి వారి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని జాతరను విజయవంతం చేయాలని కోరారు.