ADB: గుడిహత్నూర్ మండలంలోని డోంగర్గావ్లో ‘99 రోజుల ప్రజా పాలన’లో భాగంగా మంగళవారం ఉచిత టీబీ స్క్రీనింగ్ శిబిరం నిర్వహించారు. ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో గ్రామస్తులకు రక్త పరీక్షలు, స్కానింగ్ నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అధికారులు మాట్లాడుతూ.. క్షయ బాధితులకు నెలకు రూ. 1000 పోషణ భత్యం అందిస్తామని తెలిపారు.