HYD: నగరంలో గణపతి లడ్డూ వేలం పాట ధరలు ఏటేటా పెరుగుతున్నాయి. నవరాత్రుల పూజలు అందుకున్న విఘ్నేశ్వరుడి ప్రసాదం కోసం భక్తులు పోటీ పడుతున్నారు. దీంతో వేలం రూ.వేలు, లక్షల నుంచి కోట్లకు దాటిపోతోంది. ఈ ఏడాది పలికిన లడ్డూ వేలం ఇలా.. 1.బండ్లగూడ జాగీర్(కీర్తీ రిచ్మెండ్స్) రూ.2.32 కోట్లు, 2. రాయదుర్గం రూ.51 లక్షలు, 3.బాలాపూర్ లడ్డూ రూ.35 లక్షలు పలికింది.