BDK : తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వుల మేరకు భద్రాద్రి జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్‌ను నల్గొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ చేశారు. మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి ఎస్.సరితకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పజెప్పాలని హైకోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. వరంగల్ మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి జి. ప్రేమలత జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా రానున్నారు.