కామారెడ్డి: కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా ఇవ్వాలని కామారెడ్డి జిల్లా బీజేపీ అధికార ప్రతినిధి చందూరి హన్మాండ్లు డిమాండ్ చేశారు. గురువారం బాన్సువాడ పట్టణంలో ఆయన మాట్లాడుతూ.. రైతు భరోసా రూ. 15000 గత సంవత్సరం ఇవ్వాల్సిన రూ. 2500తో కలిపి ఎకరానికి రూ.17500 చొప్పున చెల్లించాలని కోరారు.